Today Horoscope In Telugu: ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి

సాక్షి

సాక్షి

1hr

Loading...

గ్రహం అనుగ్రహం: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.సప్తమి ఉ.9.27 వరకు తదుపరి అష్టమి, నక్షత్రం: శ్రవణం రా.7.11 వరకు తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: రా.1.22 నుండి 2.02 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.34 నుండి 7.15 వరకు,అమృత ఘడియలు: ఉ.8.04 నుండి 9.47 వరకు.

సూర్యోదయం : 5.34సూర్యాస్తమయం : 6.17రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకుయమగండం : ప.1.30 నుండి 3.00 వరకు

మేషం: శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రగతి. నూతన వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి స్నేహితులు తారసపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావర ణం.

వృషభం: కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.

మిథునం: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. అదనపు బాధ్యతలు. కుటుంబంలో చికాకులు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.

కర్కాటకం: బంధువులతో సఖ్యత. పోటీపరీక్షల్లో విజయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

సింహం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. కార్యసిద్ధి. పనులు అనుకున్న విధంగా పూర్తి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

తుల: మిత్రులతో కలహాలు. అనారోగ్యం. ధనవ్యయం. విద్యార్థులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృశ్చికం: చిన్ననాటి మిత్రుల కలయిక. ధన,వస్తులాభాలు. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

ధనుస్సు: పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కుంభం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

మీనం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అందరిలోనూ గుర్తింపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi