Hyderabad: నిరుద్యోగుల వయోపరిమితి 46 ఏళ్లకు పెంచాల్సిందే.. ఓయూలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్

Hyderabad: నిరుద్యోగుల వయోపరిమితి 46 ఏళ్లకు పెంచాల్సిందే.. ఓయూలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్

hmtv

hmtv

37m

Loading...

Hyderabad: నిరుద్యోగుల వయోపరిమితి 46 ఏళ్లకు పెంచాల్సిందే.. ఓయూలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్

హైదరాబాద్ (ఓయూ): ఉస్మానియా యూనివర్సిటీ: తమిళనాడు తరహాలో తెలంగాణలో రాజకీయ సునామిని సృష్టించి నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని గత ప్రభుత్వం నిరుద్యోగులకు పెంచిన 46 సంవత్సరాల వయసు పెంచి ఉద్యోగాలు ప్రకటించాలని ఆర్ పి ఐ (భీమ్ రావ్ అంబేద్కర్)పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

నిరుద్యోగ జేఏసీ నాయకులు తెలంగాణ జనార్ధన్, ఆస్మా, కాశీనాథ్, రాము, చంద్రశేఖర్ ఉపేందర్ లతో కలిసి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నిరుద్యోగులకు ఉద్యోగ వయసు 34 సంవత్సరాలు మాత్రమే ఉందని పక్క ఉన్న ఆంధ్రప్రదేశ్లో 44 సంవత్సరాలు గరిష్ట వయసు అని గత ప్రభుత్వం 46 సంవత్సరాల వయసు పెంచుతూ ఇచ్చిన జీవోను వెంటనే అమలు చేస్తూ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

లేకపోతే నిరుద్యోగులతో ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తామని ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ హెచ్చరించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ నేతలు మాట్లాడుతూ గత కెసిఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను వాడుకొని వదిలేసినట్లే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల పోరాటంతో అధికారంలోకి వచ్చి వారిని నట్టేట ముంచిందని అన్నారు. ప్రతి సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి నెలకు 2500, విద్యార్థి భరోసా కార్డు తో పాటు మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని అనేక హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. వారికి తెలంగాణలో రాజకీయ సమాధి కట్టి తమిళనాడు తరహాలో నిజాయితీపరుడైన విద్యావంతుడు తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ నేతృత్వంలో ఆర్పిఎఫ్ పార్టీ ని తెలంగాణలో బలోపేతం చేసి రాజకీయ విప్లవాన్ని సృష్టిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్పిఐ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొంట బాబు, ఉపాధ్యక్షులు పల్లెర్ల మైసయ్య, ఎస్టీ విభాగ అధ్యక్షులు కైలాష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu