దంపతుల కథలు, వ్యథలు సినిమాలుగా తీస్తే... బోలెడన్ని కొత్త పాయింట్లు బయటకు వస్తాయి. ఎందుకంటే... ఒక్కో జంట కథ ఒక్కోలా ఉంటుంది.
ఏ ఇద్దరి ఎమోషన్ ఒకటి కాదు.
పైగా అందరి ఇంట్లో జరిగే వ్యవహారాలే. త్వరగా కనెక్ట్ అయిపోయే చాన్స్ ఉంది.
మనదైన కథలకు ఎప్పటికీ విలువ ఉంటూనే ఉంటుంది.
'సతీ లీలావతి' సినిమా కూడా అలాంటి ఆలుమగల కథే.
మూడేళ్ల కాపురం
లీలా (లావణ్య త్రిపాఠి), రామ్ సేతు (దేవ్ మోహన్) భార్యా భర్తలు. లీలా ఓ స్టార్ డైరెక్టర్. సేతు ఓ డాక్టర్.
మొదట్లో ఇద్దరి కాపురం బాగానే ఉండేది. కానీ.. మూడేళ్లు గడిచాక తనకు టైమ్ కేటాయించలేకపోతోందన్న కారణంతో సేతులో భార్య పట్ల ఓ అసంతృప్తి మొదలవుతుంది.
దాంతో భార్యను విడాకులు ఇవ్వమంటాడు. ఈ ఊహించని పరిణామాన్ని లీలా ఎలా తీసుకొంది? తన భర్తని దారిలో పెట్టడానికి ఏం చేసింది?
వీరిద్దరి కథలో... నికోలా సబాస్టియన్ (మడోనా సబాస్టియన్) పాత్రేమిటి? ఈ విషయాలన్నీ తెరపై చూసి తెలుసుకోవాలి.
కథగా చెప్పుకొంటే మూడు ముక్కల్లో సింపుల్ గా తేలిపోతుంది 'సతీ లీలావతి'.
ఇలాంటి రేఖామాత్రమైన కథతో దర్శకుడు రెండు గంటల పాటు మ్యాజిక్ చేద్దామనుకొన్నాడు.
తొలి పది నిమిషాలూ భారంగా సాగుతాయి. లీలా పాత్ర పరిచయం, సేతూతో జీవితం.. వీటికే ఎక్కువ సమయం తీసుకొన్నాడు దర్శకుడు.
'విడాకులు' అనే పాయింట్ దగ్గర కాన్‌ఫ్లిక్ట్ రేజ్ అయ్యింది.
కథలోని సంఘర్షణలోకి దర్శకుడు చాలా త్వరగా వెళ్లిపోయాడు. అంత వరకూ ఓకే. కానీ ఆ తరవాత కథ ఎలా మలుపు తిరుగుతుంది అనేది చాలా ఆసక్తికరం.
లీలా పాత్ర చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది.
'విడాకులు' కోరే భర్తతో ఫైటింగులు చేస్తుంది. కట్టి పడేస్తుంది.
Durga Devi Pictures LLP/YouTubeదొంగ పాత్రలో సప్తగిరి..
సినిమా అంతా ఒక ఇంట్లోనే జరిగిపోతుంది.
'ఇక్కడ్నుంచి కదలకూడదు' అని భీష్మించుకొని కూర్చున్నట్టు... ఆ ఇంట్లోనే మిగిలిన పాత్రలన్నీ ఎంట్రీ ఇస్తుంటాయి. ఆ ఇంట్లోంచి వెళ్తుంటాయి.
ఓ దొంగ, ఒక నిర్మాత, ఓ లాయర్... ఆ ఇంటి చుట్టూ ప్రదక్షణలు చేస్తుంటారు. ఆయా సన్నివేశాలన్నీ వినోదాత్మకంగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. కానీ... ఆ ప్రయత్నమూ జరగలేదు.
దొంగగా సప్తగిరి వచ్చిన దగ్గర్నుంచి కాస్త రిలాక్సేషన్ దొరుకుతుంది.
చివర్లో కిడ్నాప్ డ్రామాలూ, ఛేజింగులు, బిగ్ బాస్ తరహాలో సాగే గేమ్.. దాంతో ముడిపడ్డ క్లైమాక్స్.
Durga Devi Pictures LLP/YouTube'సతీలాలావతి'లో ఇంట్రస్టింగ్ ఫ్యాక్టర్ కథానాయిక పాత్ర చిత్రణ.
దేవ్ మోహన్ ఉన్నంతలో బాగానే చేశాడు. ఆయన మలయాళీ నటుడు. అయినా సరే తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొన్నాడు.
నరేష్ ఓకే అనిపిస్తారు. సప్తగిరి నటన, ఆయన హావభావాలు రిలాక్స్ కలిగిస్తాయి. సప్తగిరి ఉన్నంత సేపూ.. థియేటర్‌కి హుషారు వస్తుంది. ఆ పాత్ర ఇంకొంచెం సేపు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ పాత్రకిచ్చిన ట్విస్ట్ కూడా కన్వెన్సింగ్ గా ఉంది.
తమిళం నుంచి జాఫర్ సిద్దిక్, వీటీవీ గణేష్‌లను తీసుకొచ్చారు కానీ, వాళ్లని సరిగా వాడుకోలేదు.
మిక్కీ సంగీతం హాయిగా ఉంది. పాటల్లో మాటలు చెవులకు వినిపించాయి. నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం కూడా కూల్‌గా సాగాయి. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది.
ఎమోషన్స్‌ని బలంగా పట్టుకొని, సన్నివేశాలు అల్లుకొని ఉంటే ఓ మంచి ఫ్యామిలీ డ్రామా అయ్యేది.
భార్యాభర్తల కథలో ఎప్పుడూ ఓ మ్యాజిక్ ఉంటుంది. వాళ్ల ఎడబాటు, ప్రేమ, కలయిక.. ఎప్పుడూ థియేటర్లో ప్రేక్షకుల్ని కూర్చోబెట్టే అంశాలే.
కాకపోతే ఆయా సన్నివేశాల్లో సహజత్వం చాలా కీలకం.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
సతీలీలావతి మూవీ రివ్వూ, లావణ్య త్రిపాఠి Durga Devi Pictures LLP/YouTubesource: bbc.com/telugu

