తమిళనాడు: విజయ్‌కు సీపీఐ, సీపీఎం మద్దతు.. వీసీకే నిర్ణయం కోసం ఎదురుచూపు

తమిళనాడు: విజయ్‌కు సీపీఐ, సీపీఎం మద్దతు.. వీసీకే నిర్ణయం కోసం ఎదురుచూపు

BBC News తెలుగు

BBC News తెలుగు

15m

Loading...
@TVKPartyHQ/X

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు దిశగా విజయ్‌కు సమీకరణాలు కుదురుతున్నాయి. 108 సీట్లు గెలుచుకున్నా తాను రెండు చోట్ల నుంచి గెలవడంతో 107 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉన్న విజయ్ పార్టీ టీవీకే మెజారిటీ మార్క్ 118కి 11 సీట్లు దూరంలో నిలిచిపోయింది.

దీంతో ఆ పార్టీకి ఇతరుల మద్దతు అవసరమైంది. అయిదుగురు సభ్యులున్న కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ప్రకటించగా

బేషరతుగా మద్దతిచ్చాయి.

దీంతో టీవీకే బలం 116కి పెరిగింది. మెజారిటీ మార్క్‌కు ఇది రెండు సీట్ల దూరం.

మరో పార్టీ విదుతలై చిరుతైగల్ కచ్చి(వీసీకే) ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. వీసీకే నేతలు టీవీకేతో పొత్తుపై చర్చించేందుకు సమావేశమవుతుండడంతో వారి నిర్ణయం కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో విజయ్ నేడు (శుక్రవారం) సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు.

కాగా విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అంశంపై సీపీఎం, సీపీఐలు శుక్రవారం కీలక సమావేశం నిర్వహించాయి.

.. 'టీవీకే సీపీఐ, సీపీఎంలను సంప్రదించింది. తమిళనాడు ప్రజలు ఇప్పటికే టీవీకేను ఎన్నుకోవాలని నిర్ణయించారు.
మేం కూడా ప్రజాస్వామిక విధానంలో నిర్ణయంతీసుకున్నాం' అన్నారు.

'అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. విజయ్ మా రెండు పార్టీలకు లేఖ రాశారు. మే 10లోగా ప్రభుత్వం ఏర్పాటవకపోతే గవర్నర్ పాలన వస్తుంది. అందుకే విజయ్‌కు మద్దతివ్వాలని మా రెండు పార్టీలు నిర్ణయించాయి. మళ్లీ ఎన్నికలు రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నాం. మేం కేబినెట్లో చేరం' అని చెప్పారు.

ఇప్పటివరకు ఏం జరిగిందంటే..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి.

  • మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో విజయ్ పార్టీ 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, మెజారిటీ మార్కు 118కి 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది.
  • విజయ్ రెండు చోట్ల విజయం సాధించడంతో, ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో టీవీకే బలం 107కి పడిపోయింది.
  • ఎన్నికలు ముగిసిన వెంటనే కాంగ్రెస్ తన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతును విజయ్‌కు ప్రకటించి డీఎంకేతో బంధాన్ని తెంచుకుంది. దీంతో టీవీకే బలం 112కి చేరింది.
  • గత రెండు రోజులుగా విజయ్ గవర్నర్‌ను రెండుసార్లు(మే 6, 7వ తేదీల్లో) కలిశారు. అయితే, మెజారిటీ నిరూపించుకునే వరకు ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించలేమని గవర్నర్ స్పష్టం చేశారు.
  • రాజ్ భవన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. "తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు సి. జోసెఫ్ విజయ్‌ను గురువారం (7.5.2026) చెన్నైలోని లోక్ భవన్‌కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆహ్వానించారు. ఈ సమావేశంలో, తమిళనాడు శాసనసభలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మద్దతు ఇంకా స్పష్టంగా లేదని గవర్నర్ వివరించారు" అని పేర్కొంది.
  • గవర్నర్ కావాలనే జాప్యం చేస్తున్నారని, కేంద్రంలోని బీజేపీ ఒత్తిడి వల్లే రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్, వీసీకే నేతలు ఆరోపించారు.
  • ఒకానొక దశలో దశాబ్దాల ప్రత్యర్థులైన డీఎంకే (59 సీట్లు), ఏఐఏడీఎంకే (47 సీట్లు) చేతులు కలుపుతాయనే ప్రచారం జరిగింది. దీనిపై ఇరుపార్టీల నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

టీవీకే నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీల వారీగా ప్రస్తుత బలం

టీవీకే 107 (విజయ్ రెండు స్థానాల నుంచి గెలవడంతో ఒక సీటు రాజీనామా తర్వాత)

కాంగ్రెస్ 5

సీపీఐ 2

సీపీఎం 2

మొత్తం 116

(రెండు సీట్లున్న వీసీకే కూడా మద్దతిస్తే టీవీకే బలం 118కి పెరిగి మెజారిటీ మార్క్‌కు చేరుతుంది)

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

విజయ్ @TVKPartyHQ/X

source: bbc.com/telugu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: BBC Telugu