Thalapathy Vijay: 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
తొలి ప్రయత్నంలోనే ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది.
Read Also:TVK Vijay : విజయ్‌కు మద్దతుపై కాంగ్రెస్ క్లారిటీ.. ఎంపీ కీలక వ్యాఖ్యలు
కూటమి మద్దతుతో పీఠంపైకి.. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మరియు వీసీకే (VCK) పార్టీలు టీవీకేకు తమ మద్దతు ప్రకటించాయి. ఈ పార్టీల మద్దతుతో విజయ్ స్పష్టమైన మెజారిటీని సాధించారు. దీంతో తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు విజయ్ సిద్ధమవుతున్నారు. ఈ పరిణామంతో తమిళ రాజకీయాల్లో దశాబ్దాలుగా ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకే ఆధిపత్యానికి బ్రేక్ పడినట్లయింది.
TN 12th Results 2026
Thalapathy Vijay: విద్యార్థులను అభినందిస్తూ విజయ్ వైరల్ ట్వీట్
ప్రముఖ నటుడు విజయ్ 12వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలపై స్పందించారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఫెయిలైన వారికి ధైర్యం చెబుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.పట్టుదలతో శ్రమించి విజయాన్ని అందుకున్న తన ప్రియమైన తమ్ముళ్లు, చెల్లెళ్లకు హృదయపూర్వక అభినందనలు అని విజయ్ పేర్కొన్నారు. “ఈ విజయం మీ కఠోర శ్రమకు దక్కిన గుర్తింపు. ఉన్నత విద్య అనే తదుపరి దశలోకి పూర్తి నమ్మకంతో అడుగు పెట్టండి” అని ఆయన విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ క్రమంలోనే విజయ్ పదో తరగతి మార్క్ షీట్ అంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ మార్క్ షీట్ ప్రకారం.. విజయ్ పదో తరగతిలో 1100 మార్కులకు గాను 711 మార్కులు సాధించారు. అంటే మొత్తం 64.6 శాతం మార్కులతో ఆయన ఫస్ట్ డివిజన్‌లో ఉత్తీర్ణత సాధించినట్లు రికార్డులు చెబుతున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

