ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి..!

ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి..!

News Meter తెలుగు

News Meter తెలుగు

50m

Loading...

పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్.రంగస్వామి తిరిగి ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడంతో, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ఆయనను తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

దీంతో ఆయన ఐదవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మొత్తం 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 16. ఏప్రిల్ 9న జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఏకంగా 18 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన మెజారిటీని సాధించింది. గతంలో నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన, ఇప్పుడు ఐదోసారి పగ్గాలు చేపట్టనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu