మిల్లుల్లో ధాన్యం అన్‌లోడింగ్‌ వేగవంతం

మిల్లుల్లో ధాన్యం అన్‌లోడింగ్‌ వేగవంతం

ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి

53m

Loading...

ఫొటో

02 :

- అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌

కోనరావుపేట, మే 8 (ఆంధ్రజ్యోతి) : రైస్‌మిల్లు ల్లో ధాన్యం అన్‌లోడింగ్‌ వేగవంతం చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని, సరిపడా టార్పా లిన్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ ఆదేశించారు.

కోనరా వుపేట, ఎగ్లాస్పూర్‌, కనగర్తి, నాగారం, కొలనూరు, తదితర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను, రైస్‌ మిల్లులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రాల్లో రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని జాప్యం చేయకుండా తూకం వేయాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో అన్ని కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా చూడాలని, రైతులకు క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసు కోవాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూ చించారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్‌ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు.సేక రించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి సం బంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి వాహనాలు ఏర్పా టుచేసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల ను, మిల్లులను అధికారులు పర్యవేక్షించాలని, క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించాలన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు వాహనా ల ద్వారా తరలించిన ధాన్యం బస్తాలను వేగంగా దింపుకొని, తిరిగి వాహనాలను కొనుగోలు కేంద్రాల కు పంపించేలా చూడాలని రైస్‌మిల్లుల యజమా నులను ఆదేశించారు. మిల్లులకు వచ్చిన ధాన్యం అన్‌లోడ్‌ చేయడంలో జాప్యం జరుగుతుందని, దీని వల్ల కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన బస్తాలు ఎక్కువ సంఖ్యలో నిల్వ ఉంటున్నాయని అన్నారు. హమాలీల సంఖ్యను పెంచుకుని అన్‌లోడింగ్‌ ప్ర క్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్‌ వరలక్ష్మి, నాయబ్‌ తహసీల్దార్‌ ప్రవీణ్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy