యుద్ధానికి సిద్ధం అయ్యేవాళ్లే పార్టీలో ఉండాలి..

యుద్ధానికి సిద్ధం అయ్యేవాళ్లే పార్టీలో ఉండాలి..

ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతి

56m

Loading...

JB¯èసిరిసిల్ల, మే 8 (ఆంధ్రజ్యోతి) : త్వరలోనే బీఆర్‌ఎస్‌ సభ్య త్వ నమోదు, కొత్త కమిటీలు వేస్తామని, చాకులాంటి యువ తకు అవకాశం ఇస్తామని.

యుద్ధానికి సిద్ధమయ్యేటోళ్లే పార్టీ లో ఉండాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారక రామారావు అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీ రావుపేట మండలం లింగన్నపేటలో ముత్యాల పోచమ్మ దేవా లయంలో అమ్మవారి కల్యాణ వేడుకలు, ఎల్లారెడ్డిపేట మండ లం దుమాలలో శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ వేడు కలు, రాగట్లపల్లిలో శ్రీ మల్లికార్జున స్వామి కేతమ్మ కల్యాణ మహోత్సవం, వీర్నపల్లి మండలం భావుసింగ్‌ భూక్య తండా లో జగదాంబ మాత సేవాలాల్‌ మహారాజ్‌ విగ్రహ ప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొన్నారు. వీర్నపల్లిలో బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు, రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ యుద్ధానికి ఎలాగైతే సిద్ధమవుతామో రానున్న ఎన్నిక ల్లో కూడా అలాగే సిద్ధంగా ఉండాలని, బీఆర్‌ఎస్‌ నాయకులు కేసులకు భయపడవద్దని అన్నారు.మున్సిపాలిటీల్లో గెలిచినట్టే పరిషత్‌ ఎన్నికలు పెడితే గట్టిగా కొట్లాడి గెలవాలన్నారు. సమస్యలపై పోరాడుతూ ఢీ అంటే ఢీ లాగానే కొట్లాడాలని, కేసులకు భయపడేవాళ్ళు కాదని పోరాడే కార్యకర్తలే కావాలని అన్నారు. మరో రెండేళ్లు ఇబ్బంది ఉన్న భరించాలని తర్వాత కేసీఆర్‌ సీఎం అవుతాడని మళ్లీ మంచి రోజులు వస్తాయని అప్పుడు నాయకులు, కార్యకర్తలను నెత్తిన పెట్టి చూసుకుంటా నని అన్నారు. దేశమంతా కాంగ్రెస్‌ దరిద్రాన్ని ఎప్పుడో వదిలిం చుకుంటే, తెలంగాణలో మనవాళ్లు నెత్తిన రుద్దుకున్నారని, దారిన పోయిన దరిద్రాన్ని తెచ్చుకున్నందుకు రైతులు, విద్యా ర్థులు ఆగమవుతున్నారని అన్నారు.కాంగ్రెస్‌ ఏదీ చేయదని వడ్లు, మక్కలు కొనరు, బోనస్‌లు ఇవ్వరని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని 12 వేల ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్‌ దరిద్రం రెండేళ్లు ఉం టుందని, మళ్లీ ఎన్నికల్లో గట్టిగా గుద్దితే పోతుందని అన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఏమైనట్లు అంటే ఇదిగో అరెస్ట్‌, అదిగో అరెస్టు అంటారని ఏం తప్పు చేశామని అరెస్టు చేస్తారన్నారు.అరెస్టు చేస్తామంటే చేసుకో కొడకా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ రేవంత్‌రెడ్డి కంట్లో నలు సులాగా తయారయిందని అన్నారు. కొద్దిరోజులు ఆగితే అధి కారులు కూడా వారి మాట వినరని మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం వస్తుందని తెలుస్తుంది అన్నారు.కాంగ్రెస్‌ వాళ్లది గవర్న మెంట్‌ కాదు దండుపాళ్యం మూఠ అన్నారు.ఢిల్లీకి మూటలు పంపాలి.. కుర్చీలు కాపాడుకోవాలని, ఏ మంత్రి ఎంత దోచు కోవాలనే ఆలోచనలో ఉంటుందన్నారు. స్వయంగా మంత్రి సురేఖమ్మ బిడ్డనే రేవంత్‌రెడ్డి కన్ను భుములపై పడిందని జపాన్‌లో ఉన్న ఫైల్‌ తెప్పించుకొని నీకు ఇంత నాకు అంత మాట్లాడుకు న్నారని చెప్పిందన్నారు. మేడారం జాతరలో రూ.70కోట్ల పనులు జరిగి తే వాటాల కోసం మంత్రులు సీతక్క, సురేఖక్క పొంగులేటి కొట్లాడుకున్నా రన్నారు.సందెట్లో సడే మియాలాగా బీజేపీలో ఒకరు ఉన్నారని రైతుల గురించి తెలవదు, వడ్ల కొనుగోలు, కరెంటు గురించి, కాంగ్రెస్‌ ఇచ్చిన హా మీల గురించి మాట్లాడరని, మతం పేరు మీద ప్రజల నెత్తి ఖరాబ్‌ చేసు డే బండి సంజయ్‌ పని అన్నారు. కేంద్రమంత్రి హోదాలో ఎక్కడన్నా ఒక్క బడి, గుడి కట్టించాడా అని ప్ర శ్నించారు చదువు వస్తదా.. శాస్త్రం వస్తదా.. అంటూ ఎద్దేవా చేశారు.కేంద్ర మంత్రిగా వీర్నపల్లికి రెండున్నర ఏళ్లలో ఒక్క రూపాయి పని అయినా చేశాడని ప్రశ్నించారు. దేవుని పేరు చెప్పి, అక్షింతలు ఇచ్చి, బొట్టు పెట్టి ఓట్లు వేయించుకోవడం తప్ప వేరే ఏమీ తెలియదని అన్నారు. కేసీఆర్‌ హయాంలో ప్రభుత్వం సొమ్ముతో యాదాద్రి కట్టినామని, దేశంలో బీజేపీ వాళ్లు ఎక్కడైనా ఒక గుడి నిర్మించారా అని ప్రశ్నించారు. రామ మందిరం కూడా ప్రజల భాగస్వామ్యం, చందాలతో నిర్మాణం చేశారని అన్నారు. కేసీఆర్‌ హయాంలో భూముల విలువలు పెరిగాయని కాంగ్రెస్‌ పాలనలో భూముల విలువ పడిపోయిందని అన్నారు. ఈ సమావేశంలో నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy